హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు రాగిజావ అందించనున్నారు. సర్కార్ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు వారంలో మూడు రోజులు ఈ జావ పంపిణీ చేయనున్నారు. ఇదే అంశంపై మంగళవారం ఇంటర్ విద్యా డైరెక్టర్ అభిలాష అభినవ్ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ప్రతినిధులతో చర్చలు జరిపారు.
రాష్ట్రంలో 1.92లక్షల విద్యార్థులున్నారు. వీరికి జూన్ 1 నుంచి రాగిజావ అందజేసే అంశంపై చర్చలు జరిపారు. కొత్త విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నభోజనం సమకూర్చనున్నారు. సర్కార్ బడుల్లోని విద్యార్థులకు వారంలో మూడు రోజులు రాగిజావ అందిస్తుండగా, ఇంటర్లోనూ ఇదే తరహాలో పంపిణీ చేయాలన్న దిశగా చర్యలు చేపట్టారు.