హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. మంగళవారం సచివాలయం మీడియా సెంటర్ వద్ద ఆయన మా ట్లాడారు.
బడ్జెట్ కొరత సాకుతో ప్రభుత్వం ఫీజులు చెల్లించకుండా, మరోవైపు కాం ట్రాక్టర్లకు వేలకోట్లు చెల్లిస్తున్నదని ధ్వజమెత్తారు. 14 లక్షల మంది విద్యార్థుల జీవి తాలతో ఆడుకోవడం ఏంటని మండిపడ్డారు. పథకాన్ని గతంలో మాదిరిగా అమ లుచేయాలని, లేకపోతే వచ్చేనెలలో 5 లక్షల మందితో రేవంత్ ఇంటిని ముట్టడిస్తా మని, మంత్రులు, ఎమ్మెల్యేలను తిరుగనివ్వబోమని కృష్ణయ్య హెచ్చరించారు.