హైదరాబాద్, అక్టోబర్18 (నమస్తే తెలంగాణ): విదేశీ విద్యానిధి పథకానికి ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సం ఘం అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశా రు. సీఎం రేవంత్‌రెడ్డికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు గత ప్రభుత్వం ఓవర్సీస్ స్కీమ్‌ను ప్రవేశపెట్టి, రూ.20లక్షల వరకు ఆర్థికసాయం అందించిందని గుర్తుచేశారు. పథకం ద్వారా ఎంపికైన అనేకమంది ప్రస్తుతం విదేశాల్లో చదువుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆ విద్యార్థులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు.