హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరును అధిష్ఠానం ఏకగ్రీవంగా ఖరారుచేసింది. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం మాధవ్ పేరును అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉన్నది.
ఆర్ఎస్ఎస్, బీజేవైఎంలో పలు బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, గతంలో శాసన మండలిలో ఫ్లోర్‌లీడర్‌గా పనిచేశారు. 2017లో ఏపీ శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు.