ఢిల్లీకి మూటలు మోస్తున్న రేవంత్.. మాజీ మంత్రి అజయ్‌కుమార్
రాష్ట్రంలో ఓ వైపు అన్నదాతలు అరిగోస పడుతుంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ఢిల్లీకి మూటలు మోస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. అన్నదాతల గోడు పట్టని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని మండిపడ్డారు. ‘బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్'పై వైరా నియోజకవర్గ బూత్‌స్థాయి ఏజెంట్లకు వైరాలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
- రాష్ట్రంలో అన్నదాతల గోడు పట్టని అసమర్థ ప్రభుత్వం
- అధికారం కోసం ‘సర్’తో బీజేపీ యత్నం: వద్దిరాజు
- ‘ఎస్ఐఆర్’ కుట్రలను బూత్ ఏజెంట్లు తిప్పికొట్టాలి: తక్కెళ్లపల్లి
- వైరా గడ్డపై గులాబీ జెండా ఎగురవేస్తాం: తాతా మధు
వైరా టౌన్, జూన్ 22: రాష్ట్రంలో ఓ వైపు అన్నదాతలు అరిగోస పడుతుంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ఢిల్లీకి మూటలు మోస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. అన్నదాతల గోడు పట్టని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని మండిపడ్డారు. ‘బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్’పై వైరా నియోజకవర్గ బూత్‌స్థాయి ఏజెంట్లకు వైరాలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. పార్టీ సభ్యత్వ నమోదు వైరా నియోజకవర్గ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి అజయ్ మాట్లాడుతూ.. రైతుభరోసా, రుణమాఫీ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. వైరా మున్సిపల్ చైర్పర్సన్ భర్త బీఆర్ఎస్ నాయకులపైనా, కౌన్సిలర్లపైనా అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊర్కోబోమని హెచ్చరించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ద్వారా తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా 90 లక్షల ఓట్లను తొలగించడంతో అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని స్పష్టంచేశారు. 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని చెప్పారు.
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పెద్ద కుట్రలు పన్నాయని ఆరోపించారు. ఈ కుట్రలను తిప్పి కొట్టేందుకు బీఆర్ఎస్ బూత్ స్థాయి ఏజెంట్లు ఇంటింటికీ తిరిగి ‘ఎస్ఐఆర్’ గురించి ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నందున పార్టీ కార్యకర్తలు కూడా ఆ దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే ఊర్కోమని హెచ్చరించారు. సిరిపురంలో ఎమ్మెల్యే బెదిరింపులకు తలవంచకుండా సర్పంచ్ స్థానం దక్కించుకున్నామని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

