హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కార్యాలయం దందాలకు అడ్డాగా మారిందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. సెక్రటేరియట్‌లోని మం త్రి కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ప్రధాన మీడియాలో ఎలాంటి వా ర్తలు ప్రసారం కాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. శ్రీధర్‌బాబు తన కార్యాలయాన్ని అక్రమదందాలకు అడ్డ గా మార్చారని సెప్టెంబర్ 10న కల్యాణ్‌రాజ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.
కొండా సురేఖ, సీతక్క కార్యాలయ సిబ్బందిపై విచారణ చేసినట్టు శ్రీధర్‌బాబు కార్యాలయంపై ఎందుకు విచారణ జరపడం లేదని నిలదీశారు. శ్రీధర్‌బాబు తమ్ముడు శీనుబాబు అక్రమాలకు పాల్పడుతున్నాడని, సొంత నియోజకవర్గంతోపాటు అన్ని జిల్లాల్లో వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి సోదరుడికి ఎస్కార్ట్ ఇవ్వడమేంటి? అని ప్రశ్నించారు.