హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర విద్యుత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకుని అదనపు విద్యుత్తు కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా 2వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్తును కొనుగోలుచేసేందుకు అనుమతి ఇస్తూ జీవో జారీచేసింది.
ఈ విద్యుత్తు కొనుగోళ్లకు టీజీ జెన్కో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా, ఐదేండ్ల కాల వ్యవధికి 6+2 గంటలపాటు 2వేల మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు సర్కారు పచ్చజెండా ఊపింది. అయితే ఈ విద్యుత్తును కాంపిటేటివ్ బిడ్డింగ్ పద్ధతిలో కొనుగోలు చేయాలని ఆదేశించింది.