విద్యుత్తు సంస్థలు ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున కరెంట్‌ను కొనుగోళ్లు చేయనున్నాయి. అధికారిక సమాచారం మేరకు ఐదువేల మెగావాట్ల సోలార్ విద్యుత్తును కొనుగోలు చేయనున్నాయి.
రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. నిరుడు ఇదే నెలలో లేని డిమాండ్ ప్రస్తుతం 13,444 మెగావాట్ల గరిష్ఠానికి చేరింది. డిసెంబర్లో అత్యధిక డిమాండ్ ఇదే కావడం విశేషం.