నిజామాబాద్ : పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సాద్వాన్ శనివారం నిజామాబాద్ నగరంలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి నాందేడ్ గురుద్వార్‌కు వెళ్తూ మార్గమధ్యలో నిజామాబాద్ లో ఆయన కొంతసేపు ఆగారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా పంజాబ్ స్పీకర్‌కు స్వాగతం పలికారు. నగరంలోని నూతనంగా నిర్మించిన నూతన కలెక్టరేట్‌ను, పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన వసతులను వారు పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు. స్పీకర్‌తో ఇతర ప్రజాప్రతినిధుల బృందం సభ్యులు కూడా ఉన్నారు.