హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కులాలవారీగా ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను స్థిరీకరించాలని నిర్దేశిస్తూ ప్రభుత్వం రాష్ట్ర బీసీ కమిషన్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం బీసీ కమిషన్ కేవలం రిజర్వేషన్ల స్థిరీకరణ అంశంపై మాత్రమే అభిప్రాయాలు సేకరిస్తున్నదంటూ కుల సంఘాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. సమగ్ర కులగణనతోపాటు ఆయా వర్గాల అభిప్రాయాలను సేకరించాలని రాష్ట్ర బీసీ కమిషన్‌కు సూచిస్తూ గత మార్చిలో ప్రభుత్వం జీవో-26ను విడుదల చేసింది. ఆ తరువాత అందుకు అనుగుణంగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌ను జారీ చేస్తూ ఈ నెల 10న జీవో-46ను సైతం జారీ చేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్‌టెస్ట్ నిబంధనల మేరకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ బాధ్యతను సైతం రాష్ట్ర బీసీ కమిషన్‌కే అప్పగిస్తూ, అదే డెడికేటెడ్ కమిషన్‌గా వ్యవహరిస్తుందని పేర్కొంటూ జీవో- 47ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై కులసంఘాలు, మేధావులు, వ్యక్తుల అభిప్రాయ సేకరణకు ఉమ్మడి పది జిల్లాలవారీగా పర్యటించి బహిరంగ విచారణ చేపట్టాలని బీసీ కమిషన్ ఇప్పటికే నిర్ణయించింది. అందులో భాగంగా సోమవారం ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో విచారణ కొనసాగింది. కులగణన అంశాన్ని ప్రణాళికా విభాగం చూస్తున్నదని చెప్తూ.. బీసీ కమిషన్ రిజర్వేషన్ల స్థిరీకరణ అంశంపై మాత్రమే విచారణ కొనసాగించిందని బీసీ కులసంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. త్వరలో చేపట్టబోయే కులగణన, అందులో పొందుపరచాల్సిన అంశాలు, చేపట్టాల్సిన రీతిపై అందరి అభిప్రాయాలు, అభ్యంతరాలు, సలహాలు, సూచనలను బీసీ కమిషన్ స్వీకరిస్తుందని భావించామని, కానీ నిరాశే మిగిలిందని చెప్తున్నారు. ప్లానింగ్ విభాగం సర్వే నిర్వహిస్తున్నదని, ఆ తరువాతనే రిజర్వేషన్ల విషయంలో స్పష్టత వస్తుందని కమిషన్ చెప్పడంపై కూడా బీసీ కులసంఘాలు మండిపడుతున్నాయి. సర్వేను ఒక విభాగం, రిజర్వేషన్ల స్థిరీకరణను బీసీ కమిషన్ చేపట్టడం ఏమిటని? ప్రశ్నిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ఇంటింటి సమగ్ర సర్వేకు సంబంధించిన ప్రక్రియను నవంబర్ 6 నుంచి ప్రారంభించేందుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ప్రణాళికా విభాగం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే కులగణనకు సంబంధించిన ఫార్మాట్‌ను కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. కుటుంబసభ్యులందరి వ్యక్తిగత వివరాలు, చదువు, వృత్తి, ఆస్థులు, రిజర్వేషన్లతో పొందిన ప్రయోజనాలు వంటి వివరాల నమోదుతోపాటు ఆధార్ నంబర్లను సేకరించాలని నిర్ణయించారు. మొత్తంగా ఏడు పేజీలతో దాదాపు 54 ప్రశ్నలతో ప్రశ్నావళిని రూపొందించినట్టు తెలుస్తున్నది. ప్రతి ప్రశ్నకు అనుబంధంగా మరికొన్ని ప్రశ్నలను పొందుపరిచినట్టు సమాచారం. వ్యక్తిగత వివరాలే కాకుండా ఆస్థులు, రిజర్వేషన్లతో పొందిన ప్రయోజనాలు వంటి ఇతర వివరాలను కూడా సేకరించే విధంగా ఫార్మాట్‌ను సిద్ధం చేశారు. ప్రతి జిల్లా, మండలం, గ్రామం, మున్సిపాలిటీ, వార్డు నంబర్, ఇంటి నంబర్లకు ప్రత్యేక కోడ్ ఇవ్వడం ద్వారా ఈ సమాచారాన్ని నమోదు చేసేలా ప్రణాళికా విభాగం ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.
పార్ట్1లో: క్రమసంఖ్య, కుటుంబ యజమాని-సభ్యుల పేర్లు, యజమానితో సంబంధం, జెండర్, మతం, కులం/సామాజిక వర్గం, ఉపకులం, ఉపకులానికి ఉన్న ఇతర పేర్లు, వయసు, మాతృభాష, ఆధార్ నంబర్ తదితర వివరాలు సేకరించనున్నట్టు సమాచారం.
పార్ట్-2లో: ఎలక్షన్ కమిషన్ గుర్తింపుకార్డు, దివ్యాంగులైతే వైకల్య రకం, వైవాహిక స్థితి, వివాహ కాలం నాటికి వయసు, ఆరేండ్ల వయసులోపు పాఠశాలలో చేరారా లేదా? పాఠశాల రకం, విద్యార్హతలు, 6-16 ఏండ్ల మధ్య వయసువారు బడి మానేస్తే ఆ సమయానికి చదువుతున్న తరగతి, వయసు, బడి మానేయడానికి కారణాలు, 17-40 ఏండ్లలోపు వారు విద్యను కొనసాగించకపోవడానికి కారణాలు, నిరక్షరాస్యులైతే చదువుకోకపోవడానికి కారణాలు నమోదుచేస్తారు.
పార్ట్3లో: ప్రస్తుతం ఏదైనా పనిచేస్తున్నారా? చేస్తే ఆ వృత్తి, స్వయం ఉపాధి అయితే సంబంధిత వివరాలు, రోజువారీ వేతన జీవులైతే ఏ రంగంలో పనిచేస్తున్నారు? కులవృత్తి, ప్రస్తుతం కులవృత్తిలో కొనసాగుతున్నారా? లేదా? కులవృత్తి కారణంగా ఏమైనా వ్యాధులు సంక్రమించాయా? వార్షికాదాయం, ఆదాయ పన్ను చెల్లింపుదారులా? బ్యాంకు ఖాతా ఉన్నదా? లేదా? అనే వివరాలు నమోదు చేస్తారు.
పార్ట్4లో: రిజర్వేషన్ల వల్ల పొందిన విద్య ప్రయోజనాలు, ఉద్యోగ ప్రయోజనాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన వారైతే కుల ధ్రువీకరణ పత్రం పొందారా? సంచార లేదా పాక్షిక సంచార తెగకు చెందిన వారా? రాజకీయ నేపథ్యం ఏమిటి? ప్రజాప్రతినిధిగా ఉంటే ప్రస్తుత పదవి ఏమిటి? ఎన్నిసార్లు ప్రజాప్రతినిధిగా ఉన్నారు? మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? నామినేటెడ్/కార్పొరేషన్/ప్రభుత్వ సంస్థలు వేటిలోనైనా సభ్యులా? అనే ప్రశ్నలు ఉంటాయి.
పార్ట్5లో: ధరణి పాస్‌బుక్ ఉన్నదా? లేదా? ఉంటే పాస్‌బుక్ నంబర్, భూమిరకం, విస్తీర్ణం, వారసత్వమా? కొన్నదా? బహుమానమా? అసైన్డ్భూమా? అటవీహకుల ద్వారా పొందినదా? ప్రధాన నీటి వనరు, పండే పంటలు, ఏమైనా రుణాలు తీసుకున్నారా? ఏ అవసరం నిమిత్తం తీసుకున్నారు? ఎకడినుంచి తీసుకున్నారు? వ్యవసాయ అనుబంధంగా ఏదైనా పనిచేస్తారా? కుటుంబానికి చెందిన పశుసంపద (ఆవులు, ఎడ్లు, గేదెలు, మేకలు, కోళ్లు, బాతులు, పందులు, ఇతరాలు) వివరాలు సేకరిస్తారు.
పార్ట్6లో: కుటుంబ స్థిరాస్తుల వివరాలు, ఆస్తుల సంఖ్య, చరాస్తుల వివరాలు, ఆస్తుల సంఖ్య, ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాలు, నివాసగృహం రకం, స్వభావం, మరుగుదొడ్డి ఉన్నదా/లేదా? ఉంటే వాడుతున్నారా? వంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం, ఇంటికి విద్యుత్తు సదుపాయం ఉన్నదా? తదితర వివరాలను సేకరించేందుకు సన్నాహాలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే ఎన్యుమరేటర్ల ఎంపిక పూర్తి చేసి మొత్తంగా దీపావళి అనంతరం 4వ తేదీన సర్వే ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రణాళికా విభాగం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
పార్ట్1లో: క్రమసంఖ్య, కుటుంబ యజమాని-సభ్యుల పేర్లు, యజమానితో సం బంధం, జెండర్, మతం, కులం/సామాజిక వర్గం, ఉపకులం, ఉపకులానికి ఉన్న ఇతర పేర్లు, వయసు, మాతృభాష, ఆధార్ నంబ ర్ తదితర వివరాలు సేకరించనున్నట్టు సమాచారం.