వనపర్తి, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని గాలికొదిలేసిందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రేవంత్ పాలనలో ప్రజారోగ్యంపై పట్టింపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంతోపాటు డయాగ్నస్టిక్ సెంటర్‌ను పరిశీలించారు.
దవాఖానలోని వైద్య సేవల గురించి గర్భిణులను అడిగి తెలుసుకున్నారు.కొరవడిన సేవలు, వసతులపై మంత్రి రాజనర్సింహకు లేఖ రాస్తానని పేర్కొన్నారు.