దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్న ఎల్ఐసీ వాటా విక్రయానికి కేంద్రం సిద్ధమవుతుండటంతో, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ సంస్థ ఉద్యోగులు ప్రజల మద్దతును కూడగట్టే పనిలో పడ్డారు. భారీ లాభాలను ఆర్జిస్తున్న ఎల్ఐసీని తెగనమ్మేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను కరపత్రాల రూపంలో సామాన్యులకు తెలియజేస్తున్నారు. శుక్రవారం సీబీ7 హైదరాబాద్‌శాఖ సెక్రటరీ వీ రమేశ్‌గౌడ్, శర్మ, రమణ, ఇంద్ర, ప్రతిభ, సుమరంజిత, సురేశ్ తదితరులు కరపత్రాలను ముద్రించి పంచుతున్న దృశ్యం.