హైదరాబాద్, జనవరి 12 (నమస్తేతెలంగాణ) : తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పీఆర్టీయూ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పింగిలి శ్రీపాల్రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన పీఆర్టీజీఏ (ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్) సమావేశానికి ఆయన హాజరయ్యారు.