హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : టీచర్ల బదిలీలపై అభ్యంతరాలున్న నేపథ్యంలో పదోన్నతులైనా కల్పించాలని పీఆర్టీయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీలోని తన క్యాంపు క్యాంపు కార్యాలయంలో మంత్రి సబితాఇంద్రారెడ్డికి పీఆర్టీయూ నేతలు వినతిపత్రం అందజేశారు. హెచ్ఎం, సబ్జెక్టు టీచర్ పోస్టులను పదోన్నతుల ద్వారా నింపవచ్చని వారు సూచించారు.
ఇందుకు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, పదోన్నతుల జీవోను విడుదల చేసి, తక్షణమే ప్రక్రియ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మారెడ్డి అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.