ఖమ్మం అర్బన్, నవంబర్ 27 : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతామని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకర భిక్షంగౌడ్ హెచ్చరించారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఖమ్మంలోని అమరవీరుల స్థూపం వద్ద 30 గంటల నిరాహార దీక్షను గురువారం పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ప్రారంభించారు.