హైదరాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): డిసెంబర్ 1నుంచి 9వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది. ఈ మేరకు తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు రూ.531 కోట్లు చెల్లించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
తమ బకాయిలు చెల్లించకుండా పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పేర్కొన్నారు. డిసెంబర్ 1నుంచి 9వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వార్షికోత్సవాల సందర్భంగా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని పంచాయతీల కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు
వెల్లడించారు.