తుంగతుర్తి, ఏప్రిల్ 11 : అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోతున్నదని, వెంటనే కాంటాలు వేయాలని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండా ఐకేపీ కొనుగోలు కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు నిరసనకు దిగారు. వర్షానికి ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని, తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం, మిల్లర్లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.