ములుగురూరల్, అక్టోబర్ 31 : అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా సర్వాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన తిరుపతి సాంబయ్య(35) రెండెకరాల్లో వరి వేశాడు. పెట్టుబడి, ఆర్థిక ఇబ్బందులతో సుమారు రూ.5 లక్షలు అప్పులయ్యాయి. మనస్తాపం చెందిన సాంబయ్య గత నెల 26న ఇంట్లో పురుగుమందు తాగాడు.
కుటుంబ సభ్యులు గమనించి ములుగు దవాఖాన, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం, అక్కడి నుంచి ఉస్మానియాకు తరలించగా పరిస్థితి విషమించిందని, ఏమీ చేయలేమనడంతో గురువారం సాంబయ్యను స్వగ్రామానికి తీసుకురాగా, శుక్రవారం మృతిచెందాడు.