నమస్తే నెట్వర్క్, నవంబర్ 4: మక్కలు, వడ్లు కొనాలని, పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పలు జిల్లాల్లో రైతులు ధర్నా చేపట్టారు. ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రైతులు తడిసిన మక్కజొన్న, వరి పంటలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. మక్కల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో మార్కెట్‌యా ర్డు ఎదుట రహదారిపై రైతులు గంటపాటు ధర్నా చేశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లి సొసైటీ పరిధిలో ఉన్న కళ్యాపూర్ నవీపేట్- కందకుర్తి ప్రధాన రోడ్డుపై బైఠాయించారు.
పెద్దూర్లో రైతుల ఆందోళన
‘మా సెంటర్ మాగ్గావాలె’ అంటూ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు సింగిల్‌విండో పాలకవర్గం, రైతులు మంగళవారం రోడ్డెక్కారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గత కలెక్టర్ ఇక్కడ కాంగ్రెస్ నేత ఒత్తిడితో కక్షపూరితంగా సిరిసిల్ల నియోజవర్గంలోని సింగిల్‌విండోల పరిధిలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రాలను రద్దు చేసి, మహిళా సంఘాలకు అప్పగించారని ఆరోపించారు. సిరిసిల్ల నియోజవర్గంలో కేటీఆర్‌పై అక్కసుతో సింగిల్‌విండో చైర్మన్లు, పాలకవర్గాలు బీఆర్ఎస్ వారు ఉండటాన్ని జీర్ణించుకోలేక ఎత్తేశారని తెలిపారు. ప్రస్తుత కలెక్టర్ పెద్దూరు సిం గిల్ విండోకు కొనుగోలు కేంద్రం కేటాయించినప్పటికీ, కాంగ్రెస్ నాయకుల జోక్యంతో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.
రెండు నెలలు ఆగాల్సిందేనా? ; సోయా రైతులకు తప్పని తిప్పలు
ప్రభుత్వం నిర్మల్ జిల్లాలో మొదటి విడతలో 12 సోయా కొ నుగోలు కేంద్రాలకు అనుమతినిచ్చింది. స్థానిక సహకార సంఘాల ఆధ్వర్యంలో ఈనెల ఒకటిన కొనుగోళ్లకు సంబంధించిన టోకెన్లు జారీ చేయడం ప్రారంభించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 5,328తో అమ్ముకొని నష్టాలను కొంతైనా పూరించుకుందామని భావించారు. కానీ.. సెస్టెంబర్ చివరి వారంలో సోయా కోతకు రాగా.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. జనవరి 12 వరకు గడువుతో టోకెన్లు జారీ చేయగా.. కేంద్రాల్లో పంటను విక్రయించి డబ్బులు వచ్చేందుకు ఇంకొంత సమయం పడుతుంది. దీంతో యాసంగికి పెట్టుబడి రైతులు ఆందోళన చెందుతున్నారు.