చిగురుమామిడి, అక్టోబర్ 11 : గ్రామం లో మురుగు నీరు పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వస్తున్నప్పటికీ గ్రామపంచాయ తీ పట్టించుకోకపోవడంతో ఓ వ్యక్తి మురుగు నీటిలో కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నములనూర్లోని దుర్గమ్మతల్లి గుడి ఎదుట డ్రైనేజీలో మురుగు నీరు పేరుకుపోయి వాసన రావడంతో గ్రామ పంచాయతీకి స్థానికులు వంగపల్లి రవి పలుమార్లు విన్నవించారు. సమస్యను పట్టించుకోకపోవడంతో రవి మురికి నీటిలో కూర్చుని నిరసన తెలిపాడు. మురుగు నీరు, వాసనతో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, అధికారులు మురుగును తొలగించాలని కోరారు.