లింగాలఘనపురం, డిసెంబర్ 8 : స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సోమవారం నిరసన సెగ తగిలింది. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం జీడికల్లో ప్రచారంలో భాగంగా ‘కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ప్రజలకు మేలు జరిగింది.. పట్టుచీరలను పోలిన నాణ్యమైన చీరలు ఇచ్చిందని అనగానే.. మహిళలు ఎమ్మెల్యే ప్రసంగానికి అడ్డుతగిలారు. మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే ఇస్తే ఎలా? మాకియ్యరా? రుణమాఫీ పథకం అందరికీ వర్తించలేదని సగం మందికి ఇప్పటికీ రాలేదని ప్రశ్నించారు. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని నిలదీశారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదని కాంగ్రెస్ సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపిస్తే అన్ని సమస్యలు తీర్చుతానని కడియం సర్దిచెప్పారు. అలాగే మాణిక్యపురంలో ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మాట్లాడుతుండగా బిల్లులు రావడం లేదని మహిళలు ప్రశ్నించగా.. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే సమస్యలన్నీ తీరుతాయని సమాధానమిచ్చారు.