హైదరాబాద్, అక్టోబర్28 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం కమిషన్ వివిధ అంశాలపై కోరిన సమాచారానికి సంబంధించిన పత్రాలను రామగుండం రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు జస్టిస్ ఘోష్‌ను బీఆర్కే భవన్లో సోమవారం కలిసి అందజేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు సంబంధించిన నిర్మాణం, డీపీఆర్, డిజైన్లు, డ్రాయింగులు, బిల్లుల చెల్లింపు, ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ ఆయా నిర్ణయాలకు సంబంధించిన మీటింగ్‌ల మినట్స్, అనుమతులపై రిటైర్డ్ ఈఎన్సీ వెంకటేశ్వర్లును జస్టిస్ ఘోష్ ఇటీవల రెండురోజుల పాటు విచారించారు.