మహబూబ్‌నగర్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సినిమా ఇండస్ట్రీలో కేవలం నిర్మాత, హీరో, దర్శకుడు మాత్రమే లాభపడుతున్నారని, వారి కోసమే సినిమాలు తీస్తున్నారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన జడ్చర్లలో విలేకరులతో మాట్లాడుతూ హీరోయిన్లకు సరైన పారితోషకం ఇవ్వడం లేదని, కార్మికులకు, చిన్న చిన్న క్యారెక్టర్లు వేసే వాళ్లకు కూడా సరైన పారితోషకం ఇవ్వడం లేదని చెప్పారు.
పని చేసే వాళ్లకు తక్కువ డబ్బులు ఇచ్చి కోట్లు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఐబొమ్మ రవి లాంటోళ్లను ప్రజలు హీరోగా చూడడం.. అతడిని రాబిన్‌హుడ్‌లా భావించడంలో తప్పు లేదన్నారు. తప్పు చేసినవాళ్లు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదని వెల్లడించారు.
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయక సంఘాల మహిళలకు బుధవారం వడ్డీలేని రుణాల ను పంపిణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.50లక్షల మంది స్వయం స హాయక సంఘాల మహిళలకు రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తామన్నారు.