నెక్కొండ, ఏప్రిల్ 30 : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికరగుట్ట సమీపంలో ఏర్పాటుచేసిన మక్క కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు బంద్ చేయడంతో రైతులు ఆగ్రహించారు. నెక్కొండ-నర్సంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నెక్కొండ మార్కెట్లో మక్క నిల్వలు పేరుకుపోవడంతో యంత్రాంగం కొనుగోళ్లను నిలిపివేసింది.
ఏప్రిల్ 23న 600పైగా మక్కలోడ్ ట్రాకర్లతో ట్రాఫిక్ స్తంభించింది. అధికారులు మార్కెట్కు వచ్చిన ట్రాక్టర్లకు టోకెన్లు జారీ చేసి పనికరగుట్ట సమీపానికి తరలించి మక్కలను నిల్వ చేయించారు. రైతులకు వసతులు కల్పించక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.