సూర్యాపేట : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travels Bus) డీసీఎంను ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట(Suryapet) జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లున్న గౌతమ్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు దోరకుంట వద్ద డీసీఎంను వెనుక నుంచి ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ట్రావెల్ బస్సు డ్రైవర్‌కు గయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాద సమయలో బస్సులో 40 మది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.