Telangana Secretariat | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో.. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మహిళలైతే రేవంత్ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతూ.. నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. చివరకు కాంట్రాక్టర్లకు కూడా రేవంత్ ప్రభుత్వానికి ఎదురుతిరిగారు. తమకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సచివాలయంలో ధర్నాకు దిగారు కాంట్రాక్టర్లు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు 200 మంది కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసేందుకు శుక్రవారం మధ్యాహ్నం సచివాలయానికి వచ్చారు. డిప్యూటీ సీఎంను కలిసేందుకు ఆయన సెక్యూరిటీ సిబ్బందితో పాటు సచివాలయం సెక్యూరిటీ బాధ్యతలు చూసే ఎస్పీఎఫ్ సిబ్బంది ఒప్పుకోలేదు. తమలో కొందరినైనా డిప్యూటీ సీఎంతో కలిపించండి అని వేడుకున్నా సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు.
దీంతో విసుగెత్తిన కాంట్రాక్టర్లు ఆయన చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మూడేళ్లుగా తమ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేందుకు డబ్బులు ఉంటాయి కానీ తమకు ఇవ్వడానికి లేవా అని నిలదీశారు. తమ బిల్లులు క్లియర్ చేయడానికి 20 శాతం కమీషన్లు అడుగుతున్నారని.. అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు. అప్పులు తెచ్చి పనులు చేశామని.. వాటికి వడ్డీలు చెల్లించడానికే సతమతమవుతున్న తమకు 20 శాతం కమీషన్లు అడగడం ఏమిటని మండిపడ్డారు. కాంట్రాక్టర్ల ఆందోళనతో డిప్యూటీ సీఎం భట్టి సెక్రటేరియట్ నుంచి వెళ్లపోయారు.
బ్రేకింగ్ న్యూస్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కాంట్రాక్టర్ల ఆందోళన
వివిధ జిల్లాల నుంచి వచ్చిన 200 మంది కాంట్రాక్టర్లు
భట్టి విక్రమార్కను కలిసేందుకు వచ్చిన కాంట్రాక్టర్లు
ఎస్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది ఆపడంతో ఆందోళనకు దిగిన కాంట్రాక్టర్లు
బిల్లులు క్లియర్… pic.twitter.com/OvTlQsDRig
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2025