హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇసుక అందని ద్రాక్షలా మారిపోయింది. గతంతో పోల్చుకుంటే ధర దాదాపు రెట్టింపైంది. ఓవైపు వర్షాలు, మరోవైపు అధికారుల ఉదాసీనత వల్ల లారీలు ఇసుక లోడింగ్ కోసం రీచ్‌ల వద్ద 3-4 నాలుగు రోజులపాటు పడిగాపులు కాయాల్సివస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇసుక ధర పైపైకి ఎగబాకడమే తప్ప ఎన్నడూ తగ్గిన దాఖలాలు లేవు. దీంతో నిర్మాణ వ్యయం తడిసిమోపడవుతున్నది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టన్ను ఇసుక ధర సగటున రూ.1,400 వరకూ ఉండేది. వేసవి, వర్షాకాలాల్లో ఈ ధర కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ భారీగా పెరిగిన దాఖలాలు లేవు. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టన్ను ఇసుక ధర ఎన్నడూ రూ.2 వేల కంటే తగ్గలేదు. ఇసుక బజార్ల పేరుతో ప్రభుత్వమే అధికారికంగా టన్ను ఇసుక ధరను రూ.2 వేలుగా నిర్ణయించింది. కానీ, ఇసుక బజార్లలో లభిస్తున్న ఇసుక అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండటం లేదు. పైపెచ్చు బురద, మట్టితో కూడి ఉంటున్న ఆ ఇసుకను కొనేందుకు నిర్మాణదారులు ముందుకు రావడం లేదు. దీంతో యథావిధిగా బహిరంగ మార్కెట్లో ఇసుక విక్రయాలు సాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో టన్ను ఇసుక ధర రూ.2,400కు చేరుకున్నది.x
తగ్గిన ఇసుక సరఫరా
రాష్ట్రంలో ఏటా సగటున 170-175 లక్ష ల టన్నుల ఇసుక వినియోగం ద్వారా ప్రభుత్వానికి రూ.700 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. రోజూ కనీసం 50 వేల టన్నుల ఇసు క రవాణా జరుగుతున్నది. అందులో సింహభాగం హైదరాబాద్‌కే సరఫరా అవుతున్నది. వానకాలంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొన్నేండ్లుగా వేసవిలోనే నెల రోజులకు సరిపడా ఇసుకను స్టాక్ యార్డు ల్లో నిల్వ చేయడం ఆనవాయితీగా వస్తున్నది. రెండేళ్లుగా ఈ ఆనవాయితీకి తిలోదకాలివ్వడంతో ఇసుక కొరత ఏర్పడింది. 50 రీచ్‌లకుగాను 20 రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తోడుకునే వీలున్నదని, దీంతో అవసరాలకు సరిపడా ఇసుక అందుబాటులోకి రావడంలేదని అధికారులు చెప్తున్నారు. ఇసుక ధరలు అందుబాటులో లేకపోవడంతో రోబో శాండ్పైనే ఎక్కువగా ఆధారపడుతున్నామని, బిల్డర్లు, వ్యక్తిగత నిర్మాణదారులు అంటున్నారు. కొందరు సాధారణ ఇసుకపైనే ఆధారపడుతున్నామని చెప్తున్నప్పటికీ.. 150 గజాల ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.లక్ష వరకూ ఖర్చుచేయాల్సి వస్తున్నదని వాపోతున్నారు. ప్రభు త్వం ఇప్పటికైనా ఇసుక ధరలను అదుపు చే యాలని, గతంలో మాదిరిగా టన్ను రూ.1,500లోపు లభ్యమయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్మాణదారులు కోరుతున్నారు.
రెండేండ్లుగా విక్రయాలు డౌన్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక విక్రయాలు గణనీయంగా పడిపోవడంతో టీజీఎండీసీ ఆదాయం దాదాపు రూ.100 కోట్ల వరకూ తగ్గిపోయింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 222 లక్షల టన్నుల ఇసుక విక్రయాలు జరగడంతో టీజీఎండీసీకి రూ.886 కోట్ల ఆదాయం సమకూరింది. 2021-22లో సుమారు 200 లక్షల టన్నుల ఇసుక విక్రయం ద్వారా టీజీఎండీసీ ఆదాయం రూ.800 కోట్లు దాటింది. మొత్తంగా బీఆర్ఎస్ హయాంలో ఏటా ఇసుక ద్వారా సగటున రూ.700-750 కోట్ల ఆదాయం లభించింది. కానీ, గత రెండేండ్లుగా రూ.700 కోట్లు కూడా రావడం లేదు.
గతంలో ఇసుక తవ్వకాలు, ఆదాయ వివరాలు