హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్ర పర్యటన ముగిసింది. శీతాకాల విడిదిలో భాగంగా ఆమె ఆరు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించారు. సోమవారం హకీంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ రావు, సీఎస్ రామకృష్ణారావు, ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు.