హైదరాబాద్ : రాష్ట్రప్రతి రామ్నాథ్ కోవింద్ సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ పర్యటన నిమిత్తం రాష్ట్రపతి తన కుటుంబంతో నిన్న నగరానికి వచ్చిన సంగతి తెలిసిందే. బేగంపేట ఎయిర్పోర్టులో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీ బయల్దేరారు. నిన్న రాష్ట్రపతి ముచ్చింతల్లో పర్యటించి, సమతామూర్తి బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.