హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రెండు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 6.20 నుంచి 7.10 గంటల వరకు రాజ్‌భవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. 7.20 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే కోటి దీపోత్సవంలో పాల్గొంటారు. అనంతరం రాజభవన్లో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో జరిగే లోక్‌మంథన్-2024 కార్యక్రమంలో ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా మంత్రి సీతకను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అన్ని అధికార కార్యక్రమాల్లో రాష్ట్రపతి ముర్ము వెంట రాష్ట్ర మంత్రి సీతక ఉంటారు.