హైదరాబాద్ సిటీబ్యూరో/ మేడ్చల్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతకాల విడిది కోసం మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క, ప్రభు త్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి తదితరులు స్వాగ తం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. ఈ నెల 21 వరకు ఆమె హైదరాబాద్‌లో ఉంటారు.