నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఫిబ్రవరి 14 ( నమస్తే తెలంగాణ) : ఫోన్ల ట్యాపింగ్ కేసులో రెండో ముద్దాయి ప్రణీత్‌రావుకు ఒకటో అదనపు జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున ఇద్దరి జామీనులను కోర్టుకు సమర్పించాలని, పాస్‌పోర్టును జమ చేయాలని పేర్కొంది. విచారణాధికారికి సహకరించాలని, సాక్షులను-సాక్షాధారాల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించరాదని షరతులు విధించింది. ఏడాదిపాటు ప్రణీత్‌రావు రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఈ కేసులో తిరుపతన్నకు సుప్రీంకోర్టు, భుజంగరావుతోపాటు రాధాకిషన్‌రావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు, ఐ-న్యూస్ ప్రతినిధి శ్రావణ్‌లపై నాన్ బెయిలబుల్ వారంట్ పెండింగ్ ఉంది. ఇద్దరు నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.