హైదరాబాద్: ప్రజా భవన్లో ప్రజావాణి (Praja Vani) కొనసాగుతున్నది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ప్రజాభవన్‌కు (Praja Bhavan) రెండు వైపులా భారీ సంఖ్యలో జనాలు బారులు తీరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజావాణిలో పాల్గొన్నారు. అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది.
కాగా, ప్రజావాణికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ప్రజా భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో పంజాగుట్ట, బంజారాహిల్స్, బేగంపేట, హెచ్‌పీఎస్, తాజ్ వివంతా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, షాపర్స్ స్టాప్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలను క్లియర్ చేస్తున్నారు.
Date: 19-12-23 at 1130 hrs
Due to heavy flow of traffic and Peak hours, movement of vehicles is slow from Shoppers Stop, Taj Vivanta, Govt. Degree College towards Lifestyles. Begumpet Traffic police are available and regulating traffic. pic.twitter.com/3XDYFFMAZR
— Hyderabad Traffic Police (@HYDTP) December 19, 2023
Date: 19-12-23 at 1200 hrs
Due to VVIP movement and heavy flow of traffic, movement of vehicles is slow from Monappa, Praja Vaani, Greenlands, LIfestyles towards HPS. Panjagutta and Begumpet Traffic police are available and regulating traffic. pic.twitter.com/4mccxE3mco
— Hyderabad Traffic Police (@HYDTP) December 19, 2023