హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది.
దర్యాప్తు కొనసాగుతున్నదని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మంగళవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనానికి తెలియజేశారు. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. ప్రభాకర్‌రావుకు రక్షణ కొనసాగుతుందని తెలిపింది.