హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు సుప్రీంకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తుపై సిట్ అధికారులు మీడియాకు లీకులు ఇస్తున్నారని, ఇవ్వకుండా చూడాలని కో రారు. తనకు గతంలో ప్రభుత్వం క ల్పించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనంతోపాటు భద్రతా సిబ్బందిని తొలగించారని, ఇది తన భద్రతకు ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు. మరోవైపు ప్రభాకర్‌రావుకు ఇచ్చిన రిలీఫ్‌ను కొట్టివేయాలని కోరిన పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆగస్టు 4న పిటిషన్ విచారణకు రానున్నది.
కోర్టుల్లో నిలబడని ఆర్డినెన్స్ ఎందుకు? ; బీసీ సంఘాల జేఏసీ నేత ఓరుగంటి వెంకటేశంగౌడ్
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి కోర్టుల్లో నిలబడదని తెలిసినప్పటికీ, ఆర్డినెన్స్ తీసుకువస్తున్నట్టు ఎందుకు డ్రామాలాడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ నాయకుడు ఓరుగంటి వెంకటేశం గౌడ్ మండిపడ్డారు. బీసీల రిజర్వేషన్లలో సరైన విధానం అనుసరించకుండా కేవలం ఢిల్లీకి పంపి కాలం గడుపుతున్న సీఎం రేవంత్ వైఖరిని తప్పుబట్టారు. అసలు స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారా? లేదా? అనే దానిపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌చేశారు.