రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టే కుట్ర
- కేంద్రంలోని బీజేపీ సర్కార్ పన్నాగం
- అందుకే మునుగోడు ఉపఎన్నిక
- విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
చండూరు, సెప్టెంబర్ 11: తెలంగాణను అంధకారంలోకి నెట్టే కుట్రతోనే బీజేపీ మునుగోడు ఉప ఎన్నికను తీసుకొస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా చండూరు లో టీఆర్ఎస్కేవీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోఎక్కడా లేనివిధంగా తెలంగాణలో నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఓర్వలేక విద్యుత్తు సంస్కరణలు చేపట్టిందని మండిపడ్డారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకొనే గుజరాత్‌తోపాటు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నేడు రైతాంగానికి మీటర్లు పెట్టి 6 గంటల విద్యుత్తును అందిస్తున్నదని ఎద్దేవా చేశారు. 2014కు ముందు తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు నేడు గుజరాత్లో ఉన్నాయన్నారు. సంపద మొత్తం అదానీ, అంబానీలకు దోచిపెట్టి దేశాన్ని అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి గుణపాఠం తప్పదన్నారు. కార్మికులంతా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండి మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
టీఆర్ఎస్లో భారీగా చేరికలు
చండూరు/నాంపల్లి/మర్రిగూడ: చండూరు మండ లం బంగారిగడ్డకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 50 మంది.. సర్పంచ్ పల్లె వెంకటయ్య ఆధ్వర్యంలో కారెక్కారు. నాంపల్లి మండలం మల్లపురాజుపల్లికి చెందిన మాజీ సర్పంచ్ పల్లేటి లింగయ్య, పల్లేటి నాగరాజు, బీజేపీకి చెందిన గొడ్డటి రామచంద్రం టీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ మంత్రి జగదీశ్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మర్రిగూడ మండలం యరగండ్లపల్లిలో కాంగ్రెస్‌కు చెందిన 9వ వార్డు సభ్యురాలు ముండ్ల వెన్నెలాశివకుమార్తోపాటు నాయకులు ముండ్ల వెంకటేశ్, రవి, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

