హైదరాబాద్, జూన్ 12(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసే థర్డ్ డిస్కమ్ (రైతు డిస్కమ్) రైతుల పాలిట మరణ శాసనం లాంటిదని విద్యుత్తురంగ నిపుణుడు వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. దేశంలోని ఏ రాష్ట్రం చేయని దుస్సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ రైతు సం ఘం శిక్షణ తరగతుల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘విద్యుత్తు సంస్కరణలు-రైతులపై ప్ర భావం’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో వేణుగోపాల్ మాట్లాడుతూ.. రైతు డిస్కమ్ ఏర్పాటుపై రైతులకు అవగాహన లేదని పేర్కొన్నారు.
రైతు డిస్కమ్‌కు థర్మల్ పవర్‌ను కేటాయించడం దుర్మార్గమని మండిపడ్డారు. మూడో డిస్కమ్ అవసరం లేదని, రెండు డిస్కమ్‌లతో 2ఏండ్లుగా వినియోగదారులకు మంచి సేవలు అందుతున్నాయని గుర్తుచేశారు. థర్డ్ డిస్కమ్‌తో అప్పులు పెంచ డం తప్ప, ఎలాంటి ప్రయోజనమూ ఉండద ని తేల్చిచెప్పారు. డిస్కమ్ ఏర్పాటుపై కనీసం అసెంబ్లీలో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడమేంటి? అని ప్రశ్నించారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ మాట్లాడుతూ.. కొత్త డిసమ్ ఏర్పాటు వెనుక కుట్ర దాగి ఉన్నదని ఆరోపించారు.
ప్రభుత్వానికి రైతులపై నిజంగా ప్రేమ ఉంటే తకువ ధరకు వచ్చే విద్యుత్తు కేటాయించకుండా, అధిక ధర వెచ్చించి థర్మల్ విద్యుత్తును కేటాయించడం వెనుక ఉద్దేశమేంటి? అని నిలదీశా రు. పైసా కూడా ఉపయోగపడని రైతు డిసమ్కు రూ.1,306 కోట్ల ఖర్చుతో మీటర్ల బిగింపు వృథానే అని పేర్కొన్నారు. ఆదాయం లేని డిసమ్కు స్మార్ట్ మీటర్లు ఎందుకు? అని ప్రశ్నించారు. రైతు డిసమ్ ఏర్పాటు ఏకపక్ష నిర్ణయమని, 30 శాతం స్టేక్ హోల్డర్స్ అయిన ఉద్యోగులతో చర్చించకుండానే డిసమ్ ఏర్పా టు చేస్తున్నారని విమర్శించారు. రైతు డిసమ్ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరిబండి ప్రసాద్‌రావు, పీ జంగారెడ్డి, శోభన్, రవీందర్, బాలకృష్ణ, వెంకన్న, దుబ్బాక రామచందర్, పీ వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.