Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అటకెక్కించింది.. సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణను చీకటి నుంచి వెలుగు కు తీసుకెళ్లారు.. సాధ్యం కాదన్న 24 గంటల విద్యుత్‌ను అన్ని రంగాలకు కొన్ని నెలల్లోనే అందించారు. 36 వేల కోట్లను ట్రాన్స్ కో పై వెచ్చించిన నేత కేసీఆర్ ..ఎక్కడ కరెంటు పోయినా ఒక చోటి నుంచి ఇంకో చోటుకు విద్యుత్ అందించే వ్యవస్థను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు..ఆనాడు కరెంటు పోతేనే వార్త అనే స్థితి ..పవర్ ఉన్నా ఇవ్వలేము అని రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలో అధికారులు అనే వారు.. కేసీఆర్ సీఎంగా మొదటి రివ్యూ చేసింది విద్యుత్ పైనే.. మొదటి సారి ఐఏఎస్‌కు కాకుండా విద్యుత్ సంస్థల పగ్గాలు తెలంగాణ సోయి ఉన్న ఇతరులకు అప్పగించారు.. ప్రభాకర్ రావు, రఘుమా రెడ్డి శంకర్ నారాయణ్ నియామకాలు ఈ కోవలోనే జరిగాయన్నారు.
కేసీఆర్ 2014 జూన్ 2 న అధికారం చేపట్టి నవంబర్ నుంచి వ్యవసాయానికి తప్ప అన్ని రంగాలకు ఉచిత విద్యుత్ ఇచ్చారు ..అధికారులు 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వలేము అన్నారు.. సరైన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ లేనందువల్ల ఇవ్వలేము అన్నారు..మూడేళ్ల లోనే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మెరుగు పరిచి కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చారు. 28 వేల కిలోమీటర్లు విద్యుత్ లైన్లు వేశాం.. అన్ని రకాల కేవీల సబ్ స్టేషన్ల సంఖ్యను ఎన్నో రెట్లు పెంచాం..ట్రాన్స్ కో లాభాల్లో నడుస్తోంది.. ఈ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తోంది.
అవినీతి సొమ్ముకు ఆశపడి ప్రైవేటు పరం చేస్తున్నారు.. ప్రైవేట్‌కు ఎందుకు ఇవ్వాలి ?..పాలిచ్చే ఆవు లాంటి ట్రాన్స్‌కోను దోస్తులకివ్వాలని రేవంత్ కుట్ర చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు.. దేశంలో విద్యుత్ పంపిణీని ఎక్కడ ప్రైవేటు చేసినా ఫలితాలు రాలేదు.. ఒడిశా ,ఢిల్లీ ,ముంబై లో ప్రైవేటు పరం చేస్తే ఫెయిల్ అయ్యారు.. అక్కడ నల్లా బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తున్నారు .. కరెంటును ప్రైవేటు పరం చేస్తే ప్రజల ఊపిరి ఆగిపోతుంది. తక్కువ ధరకు దోస్తులకు కట్టబెట్టడం ఈ ప్రైవేటు పరం వెనక ఉన్న మతలబు.. కేసీఆర్ మీద ఎంత ఒత్తిడి ఉన్నా ఆనాడు విద్యుత్ రంగాన్ని ప్రైవేటుకు ఇవ్వలేదు. పవర్ జెనెరేషన్ కాంట్రాక్టులను నాడు భేల్ కు ,జెన్ కోకు ఇచ్చారు. ట్రాన్స్ కో లక్షల కోట్ల ఆస్తులను కారు చౌకగా అమ్మేయాలలని రేవంత్ చూస్తున్నారన్నారు.
ఆందోళనలో ట్రాన్స్ కో ఉద్యోగులు..
ట్రాన్స్ కో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ప్రశ్నించిన అధికారులఫై ఏసీబీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని జగదీష్‌రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఈ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆర్టీసీ, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు కేసీఆర్ వ్యతిరేకం. కాంగ్రెస్ ప్రభుత్వ ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. ప్రైవేట్ పరం చేస్తే రైతులకు ఉచిత విద్యుత్ పై ప్రభావం పడుతుంది. ఇదో పెద్ద కుట్ర..ప్రభుత్వ పెద్దలు వేల కోట్లు తెరవెనక మాట్లాడుకున్నారు. ప్రైవేటీకరణతో దళితులు ఇతర వర్గాలకు విద్యుత్ సబ్సిడీలు ఆగిపోతాయి.. చార్జీలు పెరుగుతాయి..సీఎం ఆయన జీవితంలో నిజం మాట్లాడరు..సమస్యలను డైవర్ట్ చేయడమే రేవంత్ పని.. జి9 బొగ్గు సింగరేణిలో ఉత్పత్తి అవుతుందనిసాక్ష్యాధారాలతో బయట పెట్టాం.. జనవరి 26 న సీఎం రివ్యూలోనే 13 జి9 రకం బొగ్గు గనుల్లో ఉత్పత్తి అవుతోందని అధికారులు చెప్పారు.
సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై తప్పుడు లెక్కలు చెప్పారు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయం చేశారు.. రేవంత్ చంద్రబాబు, డికే శివకుమార్ ల ఆజ్ఞలు పాటిస్తూ ఏపీ కర్ణాటకలకు నాణ్యమైన బొగ్గు పంపుతున్నారన్నారు జగదీష్‌రెడ్డి. యాదాద్రి లో జి6 నుంచి జి 15 వరకు ఏ గ్రేడ్ నైనా వాడుకోవచ్చు.. బొగ్గు లేని చోట పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నేతలు పిచ్చిగా మాట్లాడుతున్నారు.. నైనీ ఎక్కడ ఉంది ఒడిశా లో ..బొగ్గు ఇక్కడికి తేవడం లేదా..? గతంలో విజయవాడలో, రాయల సీమలో కట్టారు.. ఏం చెబుతారు.. రాజస్థాన్‌లో పవర్ ప్లాంట్ 3100 మెగావాట్లతో ఎందుకు పెట్టాలనుకున్నారు ?.. అందులో 1500 సోలార్ ,1600 ధర్మల్ మెగావాట్ల…తెలంగాణకు హిమాచల్‌లో హైడెల్ ప్రాజెక్టు ఎందుకు..? అది కొట్టుకుపోయింది. 52 కోట్లు ఇచ్చారు దాని మీద కూపీ లాగుతున్నాం…యాష్ మీద ఆధార పడే సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి దామరచర్లలో పవర్ ప్లాంట్ పెట్టామన్నారు.
నల్లగొండలో పవర్ ప్లాంట్ వద్దు అనే వాడిని చెప్పుతో కొట్టాలి.. సింగరేణి బొగ్గు ఉన్నా కొత్తగూడెంలో ఎందుకు బంద్ చేశారు.. దొంగతనం ,లంగతనంతోనే విద్యుత్ ఇవ్వడం లేదు.. పనికి మాలిన పనులకే సీఎం ప్రాధాన్యం పవర్ ప్లాంట్లకు కాంగ్రెస్ దయ్యం పట్టింది.. రేవంత్ డై వెర్షన్ డ్రామాలతో ఎండుతున్న పొలాలు పండుతాయా..? ఇంకో 100 మిలియన్ యూనిట్ల డిమాండ్‌ను తట్టుకునే శక్తి తెలంగాణకు ఉంది…దసరా దాకా ఎందుకు ..వెంటనే పూర్తి స్థాయి కరెంటు ఉత్పత్తి కి సీఎం ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
G9 కోల్ గురించి రేవంత్ రెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం
సింగరేణిలో అసలు G9 బొగ్గు ఉత్పత్తి కావడంలేదని అబద్ధాలు చెప్తున్నాడు
జనవరి 26వ తేదీన జరిగిన సింగరేణి బోర్డు సమావేశంలో 13 గనులలో G9 బొగ్గు ఉత్పత్తి అవుతుందని అధికారులు తేల్చి చెప్పారు
40లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లెక్కలో… https://t.co/DB4UX4Xh4V pic.twitter.com/HKWPAms11g
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2026