Harish Rao | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో.. లేదో.. కరెంట్ కోతలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఎడాపెడా కరెంట్ కోతలు విధిస్తూనే ఉన్నారు. దీంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మీటింగ్‌లోనూ ఇదే సమస్య ఎదురైంది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న కరెంట్ పరిస్థితి గురించి వివరించారు. సరిగ్గా కరెంట్ పరిస్థితిని వివరిస్తుండగానే విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో మార్పు వచ్చిందంటూ హరీశ్‌రావు సెటైర్ వేశారు. ఈ మాట వినగానే సభ అంతా నవ్వులతో నిండిపోయింది. కాగా, జనరేటర్ ఆన్ చేయడంతో హరీశ్‌రావు మళ్లీ తన ప్రసంగం కొనసాగించారు.