నర్సాపూర్,జనవరి 9 : అప్పుల బాధ తాళలేక మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్పూర్లో పౌల్ట్రీ రైతు ఆత్మహత్య చేసుకు న్నాడు. ఎస్సై లింగం తెలిపిన వివరా ల ప్రకారం.. తుజాల్పూర్కు చెందిన గొట్టిముక్కల యాదగిరి(52) వ్యవసాయం చేస్తూ, పౌల్ట్రీ నడుపుతూ జీవ నం సాగిస్తున్నాడు. కొన్ని నెలల క్రి తం అప్పుచేసి పౌల్ట్రీ షెడ్డును నిర్మించాడు.
సాగుచేస్తున్న భూమి తన తం డ్రి పేరు మీద ఉండడం, అప్పులు ఎలా తీర్చాలో తోయక పౌల్ట్రీ షెడ్డులో బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.