ఖమ్మం, మార్చి 3 : ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం అమరవీరుల స్థూపం వద్ద సోమవారం పోస్టుకార్డు ఉద్య మం చేపట్టారు. పోస్టుకార్డుపై సంతకాలు చేసి సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కేవీ కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల స్థలం, రూ.25 వేల పెన్షన్, గృహ నిర్మాణం కోసం రూ.10 లక్షల నగదు వెం టనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కోతుల బెడద నివారణకు ఏం చర్యలు చేపట్టారో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి అధ్యక్షుడు ఎం మల్లన్న రాసిన లేఖను హైకోర్టు సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి సోమవారం విచారణ చేపట్టింది. ఈ పిల్‌ను గతంలో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.