ఆలయాల వద్ద గౌడ భవనాలు
గౌడ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఆలయాల వద్ద గౌడ భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ వెల్లడించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాశ్‌గౌడ్‌ను గురువారం మైలార్‌దేవ్‌పల్లిలోని ఆయన నివాసంలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌తోపాటు మర్యాదపూర్వకంగా కలిశారు. గౌడ సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వారితో చర్చించారు.
- గౌడ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణాలు
- 23న మైలార్‌దేవ్‌పల్లిలో గౌడ సంఘం సమావేశం:పొన్నం
- ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, స్వామిగౌడ్‌తో మర్యాదపూర్వక భేటీ
మైలార్‌దేవ్‌పల్లి/బండ్లగూడ, జనవరి 18: గౌడ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఆలయాల వద్ద గౌడ భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ వెల్లడించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాశ్‌గౌడ్‌ను గురువారం మైలార్‌దేవ్‌పల్లిలోని ఆయన నివాసంలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌తోపాటు మర్యాదపూర్వకంగా కలిశారు. గౌడ సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వారితో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదాద్రిలో ఇప్పటికే గౌడ భవనంలో సేవలు ప్రారంభించామని తెలిపారు. వేములవాడ, శ్రీశైలం తదితర పుణ్యక్షేత్రాల్లో గౌడ భవనాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 23న మైలార్‌దేవ్‌పల్లిలోని దుర్గా కన్వెన్షన్ హాలులో గౌడ సంక్షేమ సంఘం సమావేశం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తనను కలవడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని, గౌడ సంక్షేమ సంఘం సమావేశాల ఏర్పాట్లపై చర్చించేందుకే కలుసుకున్నామని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ చెప్పారు. మరోవైపు, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వెంటనే బీసీ కులగణన నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఒక ప్రకటనలో కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

