హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్(Drugs)ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక విభాగం పనిచేస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుళ్ల(Constables)కు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం ఎంతో మంది ఉద్యమించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేస్తుందని చెప్పారు. కానిస్టేబుల్స్ మాత్రమే కాదు మిగతా ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని చెప్పారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు.