మిల్లా మ్యాగీ ఆరోపణలు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యం లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రేవంత్ సర్కారును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మరింత ఇరకాటంలో పడేసివిగా ఉన్నా యి. మిస్ వరల్డ్ పోటీలపై మంగళవారం సచివాలయంలో మంత్రి జూపల్లి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం కూడా పా ల్గొన్నారు. ఈ సందర్భంగా .. ‘మీ పాలనాకాలంలో మరోసారి అందాలు పోటీలు నిర్వహించే ఆలోచన ఉన్నదా?‘ అని మీడియా ప్రశ్నించగా.. ‘అంతలేదు.. వాళ్లు రమన్నా రారు.
అడిగినా రారు’ అంటూ మంత్రి పొన్నం బాంబు పేల్చారు. దీంతో అక్కడున్న మంత్రి జూపల్లి ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే ఇక ప్రెస్మీట్ ముగిసిందని ప్రకటించారు. పొన్నం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘మిస్ వరల్డ్ కంటిస్టెంట్లను ఆగమాగం జేసి తెలంగాణ పరువు మొత్తం తీస్తిరి. మళ్లొకసారి రమ్మంటే రావడానికి వాళ్లేమైనా అమాయకులా?’ అంటూ నవీన్ అనే నెటిజన్ పోస్టు పెట్టాడు. కాంగ్రెస్ నాయకుల వేధింపులకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ భయపడిందంటూ మరో నెటిజన్ పోస్టు చేశాడు.