హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఇంట గెలిచి రచ్చ గెలవాలని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ముందు తన పార్టీ నిర్మాణంలో సామాజిక సమతూకం పాటించి ఆ తర్వాతే ఇతరులకు సుద్దులు చెప్పాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బీసీ కులగణన విషయంలో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. సామాజిక సమన్యాయం వంటి విషయాలు కాంగ్రెస్ పార్టీకి పట్టవా అని ప్రశ్నించారు.
ఆ పార్టీకి సీడబ్ల్యూసీ అత్యున్నతమైనదని, అందులో ప్రస్తుతం 39 మంది సభ్యులుంటే.. కేవలం ముగ్గురే ఓబీసీలు ఉండటం దేనికి సంకేతమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి పీసీసీ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించినట్టే కల్పించి ఆ తర్వాత ఏంచేశారో అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఆ 39 మందిలో సోనియాగాంధీ సహా మహిళలు ఆరుగురే ఉన్నారని పేర్కొన్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గేను చేశామని గొప్పలు చెప్పుకుంటున్నా, ఆ పార్టీ ఆయా వర్గాలకు వాస్తవమేమిటో తెలుసని పేర్కొన్నారు. పొన్నాల లక్ష్మయ్య చెప్పిన వివరాల ప్రకారం.. సీడబ్ల్యూసీలో సామాజిక వర్గాల సమతూకం ఇలా ఉన్నది.