గాంధీభవన్ మెట్లపై పొన్నాల, రాజనర్సింహ ధర్నా
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చివరికి సంస్థాగత ఎన్నికలు కూడా సక్రమంగా నిర్వహించలేని దుస్థితికి చేరుకున్నది. పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సందర్భంగా వర్గపోరు ముదిరి ధర్నాల దాకా పోయింది.
- కాంగ్రెస్ పార్టీలో రచ్చరేపిన అధ్యక్ష ఎన్నిక
- ఓటర్ల లిస్టు అవకతవకలపై నేతల అసంతృప్తి
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చివరికి సంస్థాగత ఎన్నికలు కూడా సక్రమంగా నిర్వహించలేని దుస్థితికి చేరుకున్నది. పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సందర్భంగా వర్గపోరు ముదిరి ధర్నాల దాకా పోయింది. సోమవారం గాంధీ భవన్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఓటర్ జాబితాలో కొన్నిపేర్లు మాయం కావడం, కొన్ని ప్రత్యక్షం కావడంపై మాజీ మంత్రులు, ఆ పార్టీ సీనియర్ నేతలైన పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ ఏకంగా గాంధీ భవన్ మెట్లపైనే బైఠాయించి ధర్నా నిర్వహించారు. వీరితో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేణుకా చౌదరి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మరికొందరు ఇతర నేతలు ఓటర్ల జాబితా తీరుతెన్నులపై మండిపడ్డారు. రాత్రికి రాత్రే జాబితాలో పేర్లు మాయం కావడం, కొత్తపేర్లు జత కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ మెట్ల మీద నిరసన తెలిపే దౌర్భాగ్య పరిస్థితి రావడం బాధాకరంగా ఉన్నదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కారణం చేత సంజీవరెడ్డి (నారాయణ్‌ఖేడ్), చెంచారపు శ్రీనివాసరెడ్డి (జనగామ) పేర్లు తొలగించారో తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకు వివరణ ఇవ్వాలని రాజనర్సింహ, పొన్నాల డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ పీసీసీ డెలిగేట్స్ లిస్ట్‌లో చాలా కొత్త పేర్లు వచ్చాయని, అవి ఎలా వచ్చాయో తెలియవని మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా జాబితాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డెలిగేట్స్ జాబితాల్లో అవకతవకలపై సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నేతలు ఇప్పటికే క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పేరు జాబితాలోనే ఉండటం చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

