HomeTelanganaPonguleti Srinivas Reddy Instructed Officials To Explain The Reason For Rejection Of Applications Received At The Bhu Bharati Revenue Conferences
దరఖాస్తు తిరస్కరణకు కారణం చెప్పాల్సిందే.. అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల్లో తిరస్కరణకు గల కారణాన్ని లిఖిత పూర్వకంగా దరఖాస్తుదారులకు అందించాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, జూలై 1(నమస్తే తెలంగాణ): భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల్లో తిరస్కరణకు గల కారణాన్ని లిఖిత పూర్వకంగా దరఖాస్తుదారులకు అందించాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
మంగళవారం సమీక్షించిన ఆయ న రెవెన్యూ సదస్సుల్లో 8,27,230 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో ఇప్పటి వరకు 7,98,528 దరఖాస్తులను డాటా ఫార్మాట్లో భూభారతి పోర్టల్‌లో నమోదు చేసినట్టు తెలిపారు. దరఖాస్తును పరిశీలించిన తర్వాతే పరిష్కరించాలని ఆదేశించారు.