పెద్దపల్లి : ప్రజాపాలన పేరుతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నది. ఒక్కడికక్కడ ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతూ పోలీస్ పాలన సాగిస్తున్నది. ప్రజాస్వామ్యయుతంగా చిన్న ధర్నా చేసుకోవడానికి కూడా వీలు లేకుండా ప్రభుత్వం, పోలీసులు అడ్డుకుంటున్నారు. తాజాగా పెద్దపల్లి(Pedpadalli district) జిల్లా గోదావరిఖని చౌరాస్తాలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ధర్నాను(BRS dharna) పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో అడ్డుకున్నారు.
టెంటు వేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwer), మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నడిపెల్లి దివాకర్ రావు, పుట్ట మధు రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాలను నిర్దాక్ష్యిణంగా అణిచివేస్తున్న కాంగ్రెస్ పాలనపై సర్వత్రా విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.