హైదరాబాద్, జూన్ 26, (నమస్తే తెలంగాణ): పోలీసుల పనితీరును అంచనావేసి, మరింతగా ప్రోత్సహించేందుకు కలర్‌కోడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఉత్తమ పనితీరుకు ఆకుపచ్చ, సాధారణ పనితీరుకు ఆరెంజ్, అంతకంటే తక్కువ పనితీరుకు ఎరువు రంగుతో కోడింగ్ ఇస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం ఈ కలర్ కోడింగ్ ఆధారంగా ఆయా పోలీస్స్టేషన్ల సిబ్బందిని ప్రోత్సహించడం, మరింత మెరుగ్గా పనితీరు మార్చేందుకు సూచనలు ఇస్తారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. పోలీసుల్లో జవాబుదారీతనాన్ని పెంచేలా దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఫంక్షనల్ వర్టికల్ విధానానికి శ్రీకారం చుట్టడంతో చాలావరకు పోలీస్ విధుల్లో రోల్క్లారిటీతోపాటు పౌరులకు సేవలు చేరువయ్యాయి. దీన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కలర్ కోడింగ్‌ను ప్రవేశపెట్టారు.
జనసాంద్రత, నేరాల నమోదు శాతం ఆధారంగా పోలీసు స్టేషన్లను నాలుగు క్లస్టర్లుగా విభజించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలను మొదటి క్లస్టర్‌గా, ఆరు అర్బన్ కమిషనరేట్లను రెండో క్లస్టర్‌గా, ఎక్కువగా నేరాలు నమోదయ్యే పోలీస్ స్టేషన్లున్న పది రూరల్ జిల్లాలను మూడో క్లస్టర్‌గా, నేరాలు తక్కువగా నమోదయ్యే పోలీస్ స్టేషన్లున్న పది రూరల్ జిల్లాలను నాల్గో క్లస్టర్‌గా విభజించారు. ఆయా క్లస్టర్‌లోని పోలీస్ స్టేషన్ల మధ్యనే పనితీరును అంచనా వేస్తారు. ఉదాహరణకు కోర్టు విధులు చూసే సిబ్బందిని తీసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లలో ఆ పనిచేసేవారితోనే పోల్చి చూస్తారు. ఒక్కో పని అంశంలో మళ్లీ ప్రధాన విధులు విభజించి వాటికి వెయిటేజీ ఇస్తూ కేపీఐ(కీ ఫెర్మామెన్స్ ఇండికేటర్స్)తో పనితీరు లెక్కిస్తారు. ఇలా నెలవారీగా ఈ కలర్ కోడింగ్ ఆధారంగా సమీక్షలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. సిబ్బంది మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడమే కలర్‌కోడింగ్ విధానం ప్రధాన ఉద్దేశమన్నారు.