సంగారెడ్డి: జిల్లాలోని సుల్తాన్పూర్లో గంజాయి అమ్ముతూ వ్యక్తి పట్టుబడ్డాడు. ఆదివారం ఉదయం సుల్తాన్పూర్ చెరువు కట్టపై గంజాయి అమ్ముతుండగా వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద 1.56 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు బాచుపల్లిలోని గదిలో తనిఖీ చేయగా మరో 3.5 కిలోల గంజాయి లభించింది. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతనిది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా అని పోలీసులు చెప్పారు.